
ఎన్ వి రాకేష్ పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
కామేపల్లి జనసముద్రం జూన్ 4:
చెడు వ్యసనాలు వద్దు పోరాటాలే ముద్దు నినాదంతో
DYFI ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ చైతన్య సైకిల్ యాత్రకు PYL జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు.
డ్రగ్స్,చెడు వ్యసనాలు, ఆన్లైన్ బెట్టింగ్ నుండి యువతను చైతన్య చేసేందుకు DYFI జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన యువ చైతన్య సైకిల్ యాత్ర మరియు యాత్ర బృందానికి PYL జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలనే యువత పక్కదారులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు చెడు వ్యసనాలకు డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో వామపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాడుతామని వారు హెచ్చరించారు.