-రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ
ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ జూన్ 04
పెద్దపల్లి కమిషనరేట్ పరిధి, మంచిర్యాల జిల్లా, లక్షేట్టిపేట్ సర్కిల్ జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ రాజవర్ధన్ బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చొప్పదండిలో విధులు నిర్వహిస్తున్న గొల్లపల్లి అనూష ను జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ గా ఉత్తర్వులు జారీ చేశారు. జన్నారం సబ్ ఇన్స్పెక్టర్ గా గొల్లపల్లి అనూష నియామకమయ్యారు. నూతనంగా నియమకమైన జన్నారం ఎస్ఐ అనుష త్వరలో బాధ్యతలను తీసుకోనున్నారు.








