బోరబండ లో కాంగ్రెస్ నాయకుల వేధింపులకు బి ఆర్ ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య

Spread the love

జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి మే 31

కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపుల వల్ల అమాయకుడు బలవడం అత్యంత అవమానవీయం… ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
బోరబండ డివిజన్ బిఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్… కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు వల్ల ఆత్మహత్య చేసుకోవడం ఎంతో కలచివేసిందని.. గత కొన్ని నెలలుగా సర్దార్ ని పలు రకాలుగా వేధిస్తున్నారని.. 15 రోజుల క్రితం సర్దార్ ఇంటిని సైతం కూల్చి వేయించారు అని.. అన్ని వైపుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు… రెండున్నర ఏళ్ల వయసున్న పిల్లలు ,భార్య అనాధలు అయ్యారని ఇలా అమాయక ప్రజలను వేధిస్తూ రాక్షసుల్లా పీడిస్తున్న ఇలాంటి నాయకులను క్షమించరాదని. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ప్రజలు కూడా వీరి అరాచకాలను గమనిస్తున్నారని తొందరలోనే ఇటువంటి నాయకులకు ముగింపు పలికే రోజు వస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు….
బిఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాలు అధికారులు అనుభవించి కాంగ్రెస్కు వెళ్ళిన నాయకులే ఈ అరాచకాలు చేస్తున్నారు అని ..పిసిసి అధ్యక్షుడు గమనించాలి అని అన్నారు..
కెసిఆర్ ప్రభుత్వంలో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే స్వాగతించాంఅని…ప్రతి
సోమవారం ప్రజావాణిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్డింగ్ లపై పిర్యాదులు చేయడం…బెదిరించి
నిర్మాణదారుల వద్ద డబ్బులు దండుకోవడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి నా అని ఎద్దేవా చేసారు…
శేరిలింగంపల్లిలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా బిల్డింగ్ నిర్మిస్తుంటే ఎందుకు కూల్చివేతలు చేపట్టలేదు అని..
బిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సర్దార్ మృతికి కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి అని అన్నారు…అలగే
ఫతేనగర్ బ్రిడ్జి కోసం నాటి మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు అని గుర్తు చేశారు..
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం పోవడం వల్లే మొన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి అని అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో ఫతే నగర్ బ్రిడ్జి మరియు అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని.. లేని ఎడల బ్రిడ్జి వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు…ప్రజల పక్షాన పోరాడతాము అని తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి