జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆలయ కార్యనిర్వాహక అధికారి (ఈవో) వినోద్ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
- పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్న ఈ పుణ్యక్షేత్రం గురించి అసత్య సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తరించడం ఆందోళనకరం. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి, షేర్ చేయకండి, అని ఆయన స్పష్టం చేశారు.
- ఆలయం మూసివేతపై ఇప్పటి వరకు దేవాదాయ శాఖ నుంచి లేదా ఆలయ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని ఈవో చెప్పారు. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారిక వనరుల ద్వారానే తెలుసుకోవాలని సూచించారు.
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ తప్పుడు ప్రచారానికి లోనవ్వకుండా, వేములవాడ రాజన్న ఆలయం యథాపూర్వంగా భక్తుల దర్శనార్థం తెరిచి ఉందని ఈవో వినోద్ స్పష్టంగా చెప్పారు.





