మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (మే.31)
జనసముద్రం న్యూస్ చర్లపల్లి రైల్వే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం నడుస్తున్న బస్సుల వివరాలను సమీక్షించేందుకు గాను ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సూచరిత శుక్రవారం రోజున చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు..అనంతరం రైల్వే అధికారులతో సమీక్ష జరిపి నిత్యం ఎన్ని రైళ్లు నడుస్తున్నాయి,ప్రయాణికులు ఎంత మంది దిగటం,ఎక్కడం జరుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం నడుస్తున్న బస్సుల ట్రిప్పులు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేక ఇంకా ఆవశ్యకత ఉందా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి నడుస్తున్న బస్సుల వివరాలను తెలుసుకున్నారు.ప్రయాణికుల అవసరాల మేరకు బస్సులు నడుపనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ పవిత్ర,చెంగిచెర్ల డిపో మేనేజర్ కే.కవిత,అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి,ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు.





