జిల్లా అధికారి పై కేసు నమోదు.. – హుజురాబాద్ కోర్టు ఆదేశాలు
జనసముద్రం కరీంనగర్ జిల్లా రిపోర్టర్ హుజురాబాద్ మే 31
సమాచార హక్కు చట్టం ( ఆర్టిఐ) ప్రకారం దాఖలైన ధరఖస్తూ పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యదర్శి, జిల్లా పంచాయతీ అధికారి పై హుజురాబాద్ కోర్టు ఆదేశాలతో కేసు నమోదు అయ్యింది.ఇల్లంతకుంట మండలానికి చెందిన మల్యాల గ్రామపంచాయతీ నివాసి వేముల తిరుపతి (s/o కొమురయ్య) 2023 మే 18న గ్రామపంచాయతీ కార్యాలయానికి పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్టు చేసితే పంచాయతీ కార్యదర్శి పోస్టును తిరస్కరించడంతో, అది తిరిగి తిరుపతికి వచ్చిన వెంటనే అ రిజిస్టర్ పోస్ట్ చూడగా రిజిస్టర్ పోస్ట్ పై పంచాయతీ కార్యదర్శి”రిప్యూజ్” రాసి ఉండడము చూసి అ తరువాత
ఈ విషయాన్ని 2023 జూన్ 5న జిల్లా పంచాయతీ అధికారి వద్ద ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశాడు. తదనంతరం న్యాయవాది ఆడెపు లింగమూర్తిని సంప్రదించి, హుజురాబాద్ రెండవ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు.
కేసు వాదనలు పరిశీలించిన కోర్టు, అప్పటి పంచాయతీ కార్యదర్శి మట్ల రాజేష్ (ఏ 1), జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య (ఏ 2)పై కేసు నమోదు చేయాలని ఇల్లంతకుంట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అనుగుణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నం. 67/2025గా కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని న్యాయవాది ఆడెపు లింగమూర్తి మీడియాకు వెల్లడించారు.





