రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి…
రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు
హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి
జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా మే 20
దేశానికే అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి రైతులను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజురాబాద్ లోని తన కార్యాలయంలో రోడ్లపై రైతులు ఆరబోసిన ధాన్యం వలన కలిగే ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రైతులు ధాన్యం రోడ్లపై పోయకుండా సహకరించాలని ఆయన కోరారు. రోడ్లపై ధాన్యం విలువ చేయడంతో రాత్రి వేళలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే రోడ్లపై ఆరబోసిన ధాన్యంతో ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా గుర్తు చేశారు. సబ్ డివిజన్ పరిధిలో రైతులు కల్లాల వద్దే ధాన్యాన్ని ఆరపోసుకోవాలని సూచించారు. రోడ్లపై ధాన్యం నిల్వల వల్ల ప్రమాదాలు జరిగితే అనవసరంగా కేసుల పాలు అవుతారని హెచ్చరించారు. ఇకపై రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని అరబోయకూడదని, ఒకవేళ ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే కేసులు కూడా పెడతామని అన్నారు. రైతులపై పోలీసులకు చాలా గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని రైతులు కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





