జన సముద్రం న్యూస్, భీమారం మే 20:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ భీమారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతున్నట్టు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో గూడూరు శ్రీనివాసరావు, భీమారం తహసిల్దార్ ఏం సదానందం, ఆర్ ఐ స్రవంతి పాల్గొన్నారు





