ఒకే ఎన్నిక విధానం నిరంకుశ మైనది
యుద్ధం వద్దు శాంతి కావాలనే వారు దేశద్రోహుల
- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
బీజేపీ నిరంకుశ విధానం విడనాడి పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి పట్టణంలో ని సాధన స్కూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతీ విషయం లో నియంతృత్వ వైఖరి అవలంబిస్తుందని అన్నారు.ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో నిన్న హైదరాబాద్ లో అవగాహన సభ పెట్టారని దానికి కేంద్ర మంత్రి ఆన్లైన్ లో హజరయ్యారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఎన్నిక విధానం అసాధ్యం అన్నారు.రాజుల పరిపాలన దిశగా బీజేపీ అడుగులేస్తోందని విమర్శించారు.ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం పై జరిగే నష్టాన్ని ఆయన వెళ్ళడించారు.పహాల్గం ఉగ్రదాడి విషయం లో బీజేపీ విధానం తానే పాలక వర్గం తానే ప్రతిపక్షంగా వ్యవహారిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. ఉగ్రదాడీ విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ ల నుండి హాజరయ్యే ప్రతినిధులను బీజేపీ నిర్ణయిన్చడం ఏంటని వారు ప్రశ్నించారు. బీజేపీ సర్కారు వైఫల్యం కారణంగానే ఉగ్ర దాడి జరిగిందని ఆరోపించారు.ఉమ్మడి రాష్ట్రాల ప్రజల ఆరోగ్య ప్రయోజనాలు కాపాడే ఎయిమ్స్ లో సరైన వసతులు లేవని బీబీనగర్ ఎయిమ్స్ ను ఆయన స్వయానా సందర్శించినట్లు తెలియజేసారు.శానిటేషన్ రోగులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారని స్థానిక కేంద్ర మంత్రులు ఎయిమ్స్ ను పట్టించుకోపోవడం విచారకరం అన్నారు.ఈ మీడియా సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.





