
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి లో ఉన్న ప్రీమియర్ ఎక్ష్ప్రెస్స్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు
ఎంపీ చామల:అక్కడ జరిగినటువంటి తీరును కంపెనీ యాజమాన్యంతో చర్చించి చనిపోయినటువంటి బాదితులకు ఎక్స్గ్రేషియా దగ్గరుండి ఇప్పించడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు సరైనటువంటి వైద్యం అందే వరకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఎంపీ చామాల కోరడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపెనీ మీద ఉందని హెచ్చరించడం జరిగింది.
అలాగే ఈ కంపెనీకి సంబంధించి ముందు జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా మొత్తం పార్లమెంటరీ బోర్డుకు కంప్లైంట్ చేస్తానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా హెచ్చరించడం జరిగింది ఘటన జరిగిన తీరు చాలా బాధ కలిగించిందని ఆవేదన కలిగించిందని చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.