
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
భువనగిరి లో బి ఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు
వద్దిరాజు రవిచంద్ర, భువనగిరి పట్టణంలో విద్యానగర్ కాలనీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసారు, ఆ సందర్భంలో అక్కడ రోడ్ ప్రక్కన ఉన్న స్థలంలో ఆడుకుంటున్న పిల్లల్ని చూసి, వాలని మోటివేట్ చేయడానికి, వాళ్లదగ్గర సరియైన అట వస్తువులు లేక, వాలని అతనికి కార్ లో ఎక్కించుకొని, స్పోర్ట్స్ షాప్ కి తీసుకెళ్లి అందరికి బ్యాట్, బాల్స్, ఒక కిట్ ఇపించి, ఇంటిదగ్గర వదిలి, పిల్లలు మంచిగా చదువుకొని,ఆటలు ఆడి దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ప్రోత్సహించాడు,
ఈ కార్యక్రమం లో భువనగిరి సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు నక్కల చిరంజీవి యాదవ్, పబ్బతి హరికిషన్ గౌడ్, గుండెబోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.