
జనసముద్రంన్యూస్, ,శిరిగిరిపాడు;
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గంలోని ఇరువర్గాలు హైవేపై బుధవారం పరస్పరం కర్రలు, రాళ్ళతో దాడులకు దిగాయి. ఈ ఇరువర్గాల దాడి లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ఆసుపత్రికి తరలించటం జరిగింది. గ్రామంలో గల చర్చిలో ఫాదర్ నియామకం విషయంలో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో శిరిగిరిపాడులో ప్రస్తుతం పోలీస్ పహారా కొనసాగుతోంది.