
చిన్నమండెం జనసముద్రం న్యూస్ :
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మరియు కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం కి చెందిన అఫన్ ( 32 సం ) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి గాయపడ్డాడు.సమాచారం అందుకున్న చిన్న మండెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..