మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్.29)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ 15వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ గత చాలా కాలంలో గా ఓపెన్ డ్రైనేజీ ఉండటం వలన వర్షం వచ్చినపుడు మురుగు నీరు అంత రోడ్డు పైకి అలాగే ఇండ్లలోకి వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందులు పడటం గతంలో స్థానిక మాజీ కౌన్సిలర్ తెలుపడంతో గత పాలక వర్గం సహకారంతో ఇక్కడ వన్ ఫీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్,నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖయ్యుం,గోదా గణేష్ యాదవ్,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





