పది ఏండ్ల తరువాత రైతుల కళ్ళలో సంతోషం

Spread the love

— మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల

జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 29: (కోహెడ ప్రసాదరావు
10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల అన్నారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో సోమవారం వ్యవసాయాధికారులతో కలిసి ఆమె రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు.
తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తరువాత రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నామని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కోహెడ లోని రైతు వేదిక వద్ద మహిళా రైతులకు 50%రాయితీ తో వచ్చిన రోడ్డు వేటర్ లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,గత కెసిఆర్ ప్రభుత్వం రైతులకు రాయితీ మీద వ్యవసాయ పనిముట్లు పంపిణి నిలిపి వేయడం తో రైతులకు ఇబ్బందులు ఎదురు అయ్యాయని, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి తో మహిళా రైతులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.రాబోయే కాలంలో వ్యవసాయ పండుగ అనే విధంగా పరిపాలన చూస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తిరుపతిరెడ్డి,వ్యవసాయ అధికారి సతీష్, మాజీ సర్పంచ్ లు శెట్టి సుధాకర్, దొమ్మాట జగన్ రెడ్డి, సీనియర్ నాయకులు బందెల బాలకిషన్, నీలం సురేందర్ రెడ్డి, పోరెడ్డి సంపత్ రెడ్డి, గంగం సంతోష్ రెడ్డి, ఆవుల మహేందర్, గాజుల వెంకటేశ్వర్లు, బీనవేణి రాకేష్, మండల యూత్ అధ్యక్షులు ముంజ శివ సాయి గౌడ్, జెరిపోతుల శ్రీను, పిల్లి సత్య నారాయణ, ఏ ఈ ఓ లు మహిపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!