యాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)
జనసముద్రం న్యూస్ వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్న,నేటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వలిగొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ దాన్యం కొనుగోలు చేయడంలో ఏపీఎం జానీ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.





