పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ భారీ నినాదాలు
పహల్గాంలో అమాయక పర్యాటకులను కాల్చి చంపడం ఒక పిరికిపంద చర్య
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ని నామరూపాలు లేకుండా చేయాలి
—మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్.26)
జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని జామియా మజీద్ ముస్లింలు జుమ్మా నమాజ్ తర్వాత భారీ ఎత్తున ఉగ్రవాద పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ముర్దాబాద్,అంటూ భారీ నినాదాలతో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యుం మాట్లాడుతూ పహల్గాంలో అమాయక పర్యాటకులను కాల్చడాన్ని ఒక పిరికిపంద ప్రయత్నం చర్యాని దమ్ముంటే పాకిస్తాన్ ని యుద్ధానికి సిద్ధం కావాలని 140 కోట్ల భారతీయులు వేచి చూస్తున్నారని,భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనకాల ఉన్నామని ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేమందరము కట్టుబడి ఉంటామని,ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాద పాకిస్తాన్ ను తుదముట్టించాలని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ని నామరూపాలు లేకుండా చేయాలని తెలియజేయడం జరిగింది.మరియు పహల్గాంలోని మృతులకు అశ్రునివాళి అర్పించడం జరిగింది.మరియు వారి యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాషా,ఖుర్షిద్,అన్ను,రఫీయోద్దీన్,షారుక్,జావీద్,అక్బర్,ఖలీల్,రెహమాన్,సోఫియాన్,ఫయీమ్,ఖమర్,సలీం తదితరులు భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది.





