
జనసముద్రం న్యూస్ చింతలపూడి ఏప్రిల్26
ఏలూరు జిల్లా, ఏ .ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్
స్టేషన్ పరిధి లో చింతలపూడి మండలం లోని నాగిరెడ్డిగూడెం గ్రామము లో రాబడిన విశ్వాసనీయ సమాచారము ప్రకారము నాటు సారాయి స్థావరాలు పై గ్రామ వీఆర్వో మరియు గ్రామ మహిళా పోలీస్ సమక్షంలో చేసిన దాడుల లో వడిత్యా లక్ష్మీ అను మహిళ తప్పించుకొని పారిపోగా , తన ఇంట్లో నాటు సారాయి బట్టి ను కనుగొని , తనకు సంబంధించిన ప్లాస్టిక్ డ్రమ్ము లో (100) లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి ,(15) లీటర్ల నాటు సారాయి ను స్వాధీన పరచుకొని , ఆ మహిళ పై పరారీ కేసు నమోదు చేయడమైనది!
అలాగే చింతలపూడి మండలం లోని పాత నాటు సారాయి కేసులలో నిందితుడు గా ఉన్న భూక్యా గోపి ను చింతలపూడి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి ఎదుట 129 బంస్ చట్టం ప్రకారం హాజరు పరచి , బైండ్ ఓవర్ నమోదు చేయడమైనది!
ఈ దాడులలో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ. అబ్దుల్ ఖలీల్ , మరియు సిబ్బంది పాల్గొన్నారు అని చింతలపూడి సి. ఐ.పి.అశోక్ తెలిపినారు!