జనసముద్రం న్యూస్ పోలవరం ప్రతినిధి,జీలుగుమిల్లి, ఏప్రియల్-26,
దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించిన జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ మండల కేంద్రం జీలుగుమిల్లి రామన్నపాలెం దాసు సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి కొవ్వొత్తులు ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా దాసు సేవా సంఘం నాయకులు పాముల వరప్రసాద్, నేలటూరి సత్యం మాస్టారు మాట్లాడుతూ పెహల్గామ్ లో అతి దారుణంగా, అన్యాయంగా పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని అభివర్ణించారు. భారతదేశ శాంతి సహనాలకు మారుపేరు అని అన్నారు. ఇలాంటి పిరికిపందల చర్యలకు దేశం భయపడదని అన్నారు. ఇంత దారుణానికి ఒడికట్టిన ఉగ్ర మూకలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఉర్ల బాబి, గడ్డం పండు, జెట్టి సత్యనారాయణ, బట్టు కృష్ణ, పాముల లక్ష్మి, కళ్యాణి, నరసింహారావు పోలుకొండ, వీర్నాల విద్యాసాగర్, నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.






