

జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 26, వెల్దుర్తి మండలం;
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి కలకలం రేపింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీను భార్య తో కలిసి బైక్ మీద వెళ్తున్నప్పుడు ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో దాడి చేశారు. మా బజార్ లో టీడీపీ ఫ్లెక్సీ ఎందుకు కట్టావంటూ శ్రీను పై మూకుమ్మడి దాడి చేసి రెండు కాళ్ళు నరికారు. ఇటీవల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వివాదమే ఈ దాడికి దారి తీసిందని తెలుస్తోంది.