
జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, వెల్దుర్తి మండలం.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రమైన వెల్దుర్తి జడ్పీ హెచ్ హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు రోజుల ముందుగానే ఎస్ఐ సమందర్ వలి జడ్పీ హెచ్ హైస్కూల్ ప్రాంగణాన్ని తన అధీనంలోకి తీసుకొని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సమందర్ వలి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.

బూత్ పరిధిలో 144 సెక్షన్ విధించి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ జగదీష్ ఎన్నికల కేంద్రాన్ని తనిఖీ చేశారు. వారితో పాటు ఎస్ఐ సమందర్ వలి కూడా తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రెవెన్యూ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కూడా తమ విధులను నిర్వహించారు. ఓటర్లు క్యూ లైన్లో నించొని తమ ఓట్లు వేశారు.