
యాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)
జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సందర్శించి,తనిఖీ చేశారు.సంస్థలో జరుగుచున్న పనులను గూర్చి కమిషనర్ అంజన్ కుమార్ రెడ్డిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు.సిబ్బందితో వివిధ పనుల గూర్చి,పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.ఆయా పనులపై కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు.