
జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28మెదక్ జిల్లా
చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన సావిత్రి (39) బుధవారం ఉదయం చెరువులో బట్టలు ఉతకడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చెరువుగట్టు వద్ద గాలించగా నీటిలో సావిత్రి మృతదేహం లభ్యమయింది. మృతురాలి భర్త దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు.