
- మీడియేటర్లకు ఎంత…?? ఉన్నత అధికారులకు ఎంత..??
లోకల్ లో జోల పాట పాడుతూ, లాలూచీ పడుతున్న నాయకులు కు ఎంత…?? - ఒక బడా ఎక్స్పోర్టర్కి దోచి పెట్టడానికి లోపాయికారి ఒప్పందంతో ఏపీ ఎం డి సి యాజమాన్యం బెరైటీస్ ముడిఖనిజం అయినటువంటి సి&డి గ్రేడ్ ధర తగ్గించి 60 లక్షల టన్నులకు టెండర్లను పిలవడం జరిగింది..!!
- ఏపీఎండీసీ సంస్థలో అవినీతి పరాకాష్టకు చేరినది,సంస్థ కు సుమారు 1000 కోట్ల నష్టం చేకూర్చి ఒక బడా ఎక్స్పోర్టర్కు అందినకాడికి ఖనిజం మొత్తం ఒకేసారి దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేశారు…!!
అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ జనవరి 3 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబుళవారిపల్లి పల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెరైటీస్ ఖనిజం లభిస్తున్నది ఈ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్ ఖనిజాబి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 50 సంవత్సరాల నుండి బెరైటీస్ ఖనిజాన్ని వెలికి తీసి ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు దీనివలన ఏపీఎండీసీ సంస్థ కు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, అయితే ఈ మధ్య కాలంలో అధికారులు తీసుకుంటున్న లోపాయికారి ఒప్పంధాల వలన ఖనిజాభి వృధి సంస్థకు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది దీని వలన సంస్థ మనుగడ ప్రస్నార్ధకం అవుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు,
ఈ మధ్యకాలంలో ఏపీఎండీసీ యాజమాన్యం వారు మంగంపేట నందు ఉన్న సి&డి గ్రేడ్ 60 లక్షల మెట్రిక్ టన్నులకు టెండర్స్ పిలవడం జరిగినది ఈ టెండర్స్ పిలవడం లోనే అసలైన అవినీతి వెలుగు చూస్తున్నది ఎలా అంటే సి &డి 3.80 గ్రావిటీ నుంచి 4.00 గ్రావిటీ వరకు ఉన్న ఖనిజం ప్రస్తుతం ఒక టన్నుకు 1680 రూపాయలు రేటు ఉంటే ఏపీఎండీసీ యాజమాన్యం బయ్యర్లతో లోపాయి కారి ఒప్పందం చేసుకుని టెండర్లో ఒక టన్ను సి &డి ఖనిజం రేటు గ్రావిటీ 4.09 వరకు పెంచుతూ 1188 రూపాయలు తగ్గించడం వెనుక భారీగా అవినీతి రాజ్యమేలింది అని అర్థం అవుతుంది, దీనివలన సంస్థకు సుమారు ప్రస్తుత రేటు ప్రకారం 1000కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.ఈ అవినీతి సొమ్ము ఎవరి జేబులు నిండుతాయో అర్థం కావడం లేదు, టెండర్ ను చూస్తే చరిత్ర లో ఎన్నడు లేని విధంగా సి&డి ఖనిజం టెండర్లో రేట్లు తగ్గించి టెండర్ పిలవడం ఇదే మొదట సారి, అలాగే ఇందులో బయ్యర్లు సి&డి గ్రేడ్ స్పెసిఫిక్ గ్రావిటీ బదులు’ బి ‘ గ్రేడ్ స్పెసిఫిక్ గ్రావిటీ పొందుపరచి’ బి ‘గ్రేడ్ ఖనిజం తీసుకుని వెళ్ళేవిధంగా స్పెసిఫిక్ గ్రావిటీని ఇందులో పెట్టడం వెనుక అధికారుల అవినీతి ఏ పాటిదో అర్ధం అవుతుంది, ఈ అవినీతి టెండర్ ను కేవలం ఒక కంపెనీ వారికి మేలు చేసేందుకు వేశారని అందులో పెట్టిన టర్మ్స్ &కండిషన్స్ ను బట్టి అర్థం అవుతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ పైన విచారణ జరిపి తక్షణం టెండర్ ను రద్దు చేయాలి.
ఈ టెండర్ వలన అనేక మిల్లులు మనుగడ చాలా కష్టమవుతుంది అందులో పని చేసే కార్మికులు సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలు నడి రోడ్డున పడతాయి అలాగే చిన్న చిన్న పరిశ్రమలు మూత పడి అందులో పని చేస్తున్న వేల మంది కార్మికులు వీదులపాలు అవుతారు, ఏపీఎండీసీ సంస్థ మనుగడ ప్రస్నార్ధకం అవుతుంది కనుక వెంటనే ఈ అవినీతి టెండర్ ను రద్దు చేసి గతంలో ఉన్న మాదిరిగా సంవత్సరం సంవత్సరం టెండర్ పిలిస్తే ఖనిజం రేటు పెరిగి ఏపీఎండీసీ సంస్థకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని దీని వలన ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలులభించి,చిన్న చిన్న పరిశ్రమల వలన ప్రత్యక్షం గాను, పరోక్షంగాను కొన్ని వేల కార్మిక కుటుంబాలకు జీవనోపాధి లభించి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోఖ్యం చేసుకుని ఈ టెండర్ ను రద్దు చేసి ఈ టెండర్ వేసిన అవినీతి అధికారుల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
ఏపీఎండీసీ సంస్థ నందు 60 లక్షల మెట్రిక్ టన్నుల, సి&డి గ్రేడ్ టెండర్ ను రద్దు చేయాలని సమ్మె నోటీసు ఇచ్చిన ఏపీఎండీసీ అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు సమస్త మద్దతు దారులు..