
(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి// జనవరి 03;శంకరపట్నం)
శంకరపట్నం మండలం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న పాల వ్యాన్ లారీని ఢీకొంది. దీంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో వ్యాన్ డ్రైవర్ ను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు.