జనసముద్రంన్యూస్, ఏపీ, డిసెంబర్ 12.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేస్తారని ఎంతో ఆశతో చూసిన ప్రజల ఆశలు నిరాశలైనాయి.
మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్టు అధిక విద్యుత్ ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రజలు
అసలే పంటలు లేక, పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర లేక రైతులు, మధ్యతరగతి ప్రజలు ఆహార ధాన్యాలు ఆకాశాన్ని అంటడంతో పాటు సామాన్యుడు మోయలేని భారం కూడా ఎక్కువ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న అయోమయంలో పడుతూ ఉన్న పరిస్థితి. పక్కనే ఉన్న రాష్ట్రంలో 200 యూనిట్లు లోపు ఉన్న వారికి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తూ విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలను ఆదుకొంటూ ఉన్న పరిస్థితి. ఉచిత పథకాన్ని రద్దుచేసి ధరలు నియంత్రణ చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్లుగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకి ఎంతైనా ఉంది. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల ప్రస్తుతం పర్యావరణానికి కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాలు లో వోల్టేజ్ యంత్రాలు తయారు చేయడానికి విద్యుత్తు చాలా అవసరం. అలాంటి విద్యుత్ ధరలు పెంచి అధిక సర్ చార్జీలను పెంచడం వలన ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతారు.





