మాజీ జెడ్పిటిసి ఆంగోత్ లలిత హాతిరాం..
దామరచర్ల మండలం.అక్టోబర్ 30(జనసముద్రం న్యూస్):
ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న తరువాత ప్రజల సంక్షేమం కోసం,ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 పథకాలను అమలు చేయకుండా వ్యక్తిగత విషయాలను రాజకీయాలు చేయడం దేనికి సంకేతం అని మాజీ జెడ్పిటిసి ఆంగోతు లలిత హాథిరాం ఆరోపించారు,మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎదుర్కోలేక కేటీఆర్ బావమరిది కుటుంబ వేడుక కార్యక్రమం చేసుకుంటే ఇంట్లో డ్రగ్స్ దావతు అంటూ ప్రచారం చేయడం రాజకీయ లబ్ధి కోసమే అని అన్నారు.కేటీఆర్ ను ఆయన భార్య ఇమేజ్ ని డామేజ్ చేసేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ముందస్తు ప్రణాళిక ప్రకారమే కేటీఆర్ బావమరిది ఇంటిపై దాడులు చేశారని హామీలను విస్మరించి హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూల్చడం మూసి ఆధునీకరణ పేరుతో వందలాది మందిని నిరాశ్రయులను చేస్తుండడంతో వారి పక్షాన నిలబడి ప్రభుత్వ చర్యలను ఎండగడుతుండడంతో ఇ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు దిగుతుందని అక్రమ అరెస్టులకు భయపడేది లేదని అన్నారు.వారి వెంట వారి సతీమణి లలిత హథిరం,మాజీ సర్పంచ్ రమేష్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ మధు తదితరులు ఉన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…