పూల మాల వేసి,శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికిన అడిషనల్ డీసీపీ ఏ ఆర్ అనోక్ జయ్ కుమార్
జనసముద్రం న్యూస్:(అక్టోబర్ 26)హుజురాబాద్.
కరీంనగర్ లోని హుజురాబాద్ సబ్ కోర్ట్ నందు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బోనగిరి సంజీవ్ 34 సంవత్సరాలు పోలీస్ శాఖలో సేవలందించి శుక్రవారం నాడు పదవి విరమణ పొందారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ ఏ ఆర్ అనోక్ జయ్ కుమార్
గారి చేతుల మీదుగా పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు.పూలమాల వేసి, శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ (హోంగార్డ్స్) మోడెం సురేష్,మరియు హెడ్ కానిస్టేబుల్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.