మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి..
దామరచర్ల మండలం.అక్టోబర్ 26.(జనసముద్రం న్యూస్):
మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి వరి పంటలు పడిపోయిన రైతుల పంట పొలాలను సిపిఎం పార్టీ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకోని నష్టపరిహారం అందజేయాలని దేశానికే వెన్నుముక్క అయినటువంటి రైతన్నకు ఇలాంటి పంట నష్టాలు జరగడం చాలా బాధాకరమన్నారు,అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణమే రైతులను ఆదుకోవాలని అన్నారు.వారి వెంట రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్,జిల్లా కమిటీ సభ్యులు మాలోతు వినోద్ నాయక్,శశిధర్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కోటిరెడ్డి,బైరం దయానంద్,మట్టయ్య,రైతులు భాగ్యా,హనుమాన్,పీక్య,శేఖర్,చిన్యరెడ్డి తదితరులు ఉన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…