ప్రయాణికులకు తప్పని తిప్పలు..భయాందోళనలో వాహనదారులు
తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు…
అశ్వారావుపేట, అక్టోబర్ 26( జనసముద్రం న్యూస్ ):
అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం నుండి తోగ్గుడెం, తిరుమలకుంట వెళ్లే రహదారుల వెంట ఉన్న మూలమలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి.నిత్యం ఈ తోగ్గుడెం రహదారి గుండా వాహనదారులు, వ్యవసాయ కూలీలు, వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారి నుండే రాకపోకలు నిర్వహిస్తుంటారు.ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. నాలుగు చోట్ల మూలమలుపులు ఉండడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించు కోవడం లేదని, మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఉన్న కూడా ఇరువైపుల పిచ్చిమొక్కలు పెరగడంతో వాహనాలు దగ్గరికి వచ్చేదాక కనిపించడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప గుర్తించరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను కానీ,రాత్రి పూట కనిపించే విధంగా రోడ్ సేఫ్టీ రేడియం లైట్ లతో కాస్త అమర్చిన మూల మలుపుల ఏర్పాటు చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు వాహనదారులు వాపోతున్నారు.