(జనసముద్రం న్యూస్ కరీంనగర్ అక్టోబర్26)
హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను వరంగల్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మారుతి నగర్ కు చెందిన తేజ అలియాస్ కిట్టు అనే యువకుడు తో పాటు రంగనాయకులగుట్టకు చెందిన వెంకటేష్ అనే మరో యువకుడిని గంజాయి విక్రయ దారులతో సంబంధాలు కలిగి ఉండడంతో గురువారం రాత్రి వేలేరు పోలీసులు పట్టణానికి వచ్చి స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశముగా మారింది. అయితే ఈ ఇద్దరు యువకులు హుజురాబాద్ కు చెందిన వారు కావడం, వెంకటేష్ గతంలో కూడా గంజాయి విక్రయిస్తూ వరంగల్ జిల్లాలో పట్టుబడడంతో అతని స్నేహితుడు కావడంతోపాటు తేజకు గంజాయి విక్రయిదారులతో సంబంధాలు ఉన్నట్లు వేలేరు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో సమగ్ర విచారణలకై ఇద్దరు యువకులను హుజురాబాద్ కు వచ్చి రాత్రి మహారాష్ట్ర నంబర్ కలిగిన వాహనంలో తీసుకువెళ్లడంతో పట్టణంలో ఒక్కసారి కలకలం సృష్టించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా స్పందించిన టౌన్ సీఐ ఆ ఇద్దరు యువకుల తరలింపు పై ఆరా తీయగా వరంగల్ జిల్లా వేలేరు కు చెందిన పోలీసులు తీసుకుపోయినట్లుగా నిర్ధారించుకొని తల్లిదండ్రులకు విషయం వివరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా హుజురాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు గంజాయి విక్రయించే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.