జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:అక్టోబర్ 25:
మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తుమ్మ రాజన్న అనే (44) రైతు బుధవారం విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడని ఎస్సై సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం మద్యాహ్నం 3:00 గంటలకు గ్రామ శివారులో తన పంట పొలంకు నీరు పెట్టేందుకుకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద విద్యుత్ షాక్ తగిలి మృతిచెంది ఉండటంతో మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య మమత పిర్యాదు మేరకు అదనపు ఎస్సై రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.