కూకట్ పల్లి ప్రతినిధి జన సముద్రం అక్టోబర్ 08
బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నరసింహ రాజు సోమవారం బాధ్యతలు చెప్పటారు. గతంలో పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ గా పని చేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ సీఐగా ఉన్న నవీన్ కుమార్ రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన విషయం తెలిసిందే.
ఈ సందర్బంగా సీఐ నరసింహ రాజు మాట్లాడుతూ స్థానికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరదిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదన్నారు.
అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు గాని అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొని రావాలని వారు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామన్నారు. బాలానగర్ పరదిలో పరిధిలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.