జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 28.తిరుపతి.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27నుండి అక్టోబరు 24 వరకు(నెలరోజులపాటు) ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన దృష్ట్యా జిల్లాలో సెక్షన్ 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని తెలిపారు. శుక్రవారం పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.