(జనసముద్రం ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గ ప్రతినిధి) ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 28:
ద్వారకాతిరుమలమండలం పంగిడిగూడెం గ్రామం శివారులో పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు.దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 6. సెల్ ఫోన్లు. 15వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.వారిపై కేసు నమోదు చేసినట్లు. ద్వారక తిరుమల ఎస్సై సుధీర్ తెలిపారు.