అమనగల్ మాజీ జెడ్పిటిసి అనురాధ పత్య నాయక్
జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్
అమనగల్ పట్టణంలో కడ్తల్ తలకోండపల్లి మాడ్గుల్ అమనగల్ విజయ డైరి పాల రైతులకు 3 నెలల నుండి బిల్లులు రాక పాలను రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ఇబ్బంది పడుతుంటే వారికి మద్దతూగా బిఆర్ఎస్ మాజి జడ్పిటిసి సభ్యులు అనురాధపత్యనాయక్ .రాజీవ్ చౌరస్తా లో ధర్న నిర్వహించారు.
అనూరాధ. మాట్లాడుతూ వాళ్ల రైతుల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా 15 రోజులకు ఒకసారి వారి బిల్లు వారికి ఇచ్చి రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో ఆమనగల్ నుండి అసెంబ్లీ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ ప్రభుత్వానికి ఇది చెప్పే విధంగా ట్రాక్టర్ లతో అసెంబ్లీ ముట్టడిస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం లో ఎన్నడు రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి రాలేదని ఈ తొమ్మిది నెలల కాలంలోనే రైతులు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని అనురాధ. చెప్పడం జరిగింది. రైతుబంధు రాకపోయే రుణమాఫీ కాకపోయే వాళ్లు కష్టపడి పోసిన పాల బిల్లుని సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా డైరెక్టర్ గంప వెంకటేష్.మాజీ ఎంపీటీసీ కుమార్. సరిత పంతునాయక్ .మజి సర్పంచ్ సోనా శ్రీను నాయక్. పార్టీ సీనియర్ నాయకులు ఎంగళి రఘు. బాలస్వామి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, పరమేష్, రమేష్ నాయక్ వెంకటేష్, రమేష్ నాయక్, బద్దు, మల్లేష్, మాల్యా నాయక్, శివ కుమార్, భాస్కర్ రెడ్డి, బాలస్వామి, భీమయ్య, భాస్కర్, రవీందర్, ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.