మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు.
రూ.2.10 లక్షలు ముందుగానే వసూల్.
జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్19:
హన్మకొండ జిల్లా మెడికవర్ హాస్పటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి అయింది.పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల(72) పది రోజుల క్రితం కాలుకు ఇన్ ఫెక్షన్ తో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు.రూ.2.10 లక్షలు ముందుగానే డబ్బులు వసూల్ చేశారు.మెడికవర్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది.ఒకేసారి రెండు సర్జరీలు నిర్వహించి మరణానికి డాక్టర్లు కారణమయ్యారు.డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు.వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్దారణ చేశారు.డయాలసిస్ ఆనంతరం గాల్ బ్లాడర్ లో స్టోన్స్ బ్రేక్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.రక్తం కారుతుంది రక్తం కావాలంటూ హడావిడీ చేసిన డాక్టర్లు.ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్నరు.మాకు న్యాయం చేయాలంటున్న పర్వతగిరి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబం మెడికవర్ హాస్పటల్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.ఇంత దారుణానికి పాల్పడిన డాక్టర్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.