జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:సెప్టెంబర్ 19:
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యులైన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ అనే ఇద్దరి కిడ్నాప్ కేసును చేధించినట్లు మంచిర్యాల ఏ సీ పీ ప్రకాష్ బుధవారం మీడియా కు తెలిపారు. ఈ నెల13 న రాత్రి సమయంలో శాకపురం శంకరయ్య అనే వ్యక్తి అతని అనుచరులు తన భర్తతో పాటు అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని లింగయ్య భార్య సరోజ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై పీ సతీష్ సీఆర్.నం. 180/2024 యు/ఎస్ఈసీ 140 (3) బీఎన్ఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ, బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు కరీంనగర్ ఎక్స్ రోడ్ వద్ద నిందితులని అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.
మొదటి నిoదితుడైన శకపురం శంకరయ్య (50) అనునతడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, లక్ష్మీపూర్ గ్రామంలోని మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఈ నెల 14న ఉండడంతో ఎలాగైన ఈ ఎన్నికల్లో గెలవాలనే ఉదేశ్యంతో కిడ్నాప్ కు ప్లాన్ చేశారన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లో 31 మంది సభ్యులు ఉండగా, శంకరయ్యకి మద్దతుగా 15మంది సభ్యులు ఉండగా, అతనికి పోటీ దారుడు అయిన అరుగుల నర్సయ్యకు 16మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు తెలుసుకుని, ఇక్కడ గ్రామ ఎన్నికలో గెలిస్తే జిల్లా అధ్యక్షునిగా గెలవచ్చని భావించి, ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలని అందుకు వ్యతిరేక వర్గంలోని ఇద్దరు సభ్యులయినా పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ లను మద్దతు కోరిన శంకరయ్య వారు నిరాకరించడంతో, వారిద్దరిని ఓటింగు రోజున పాల్గొనకుండా తప్పిస్తే, శాఖపూరం శంకరయ్య గెలవచ్చనే ఉద్దేశ్యంతో వారిని కిడ్నాప్ చేశాడన్నారు. అతనికి తెలిసిన మిత్రులైన మహ్మద్ మైదీన్, సుందిళ్ల దేవేందర్, ఎల్లయ్య,మేట్టుపెల్లి రవి, తాళ్ళ అరుణ్ వారి సహకారంతో ఇద్దరు సభ్యులను కిడ్నాప్ చేయడానికి శంకరయ్య రూ.లక్షకు మాట్లాడుకొని, రూ.50 వేలు అడ్వాన్స్ గా ఇచ్చినాడన్నారు. 13 న సాయంత్రం సమయంలో రెండు కార్లు ఎర్టిగా కారు టిఎస్ 02 ఈఎఫ్4691, రెనాల్ట్ డస్టర్ ఏపీ 09 సీఎమ్ 4554 నెంబర్ లు గల కారులలో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పందిరి లింగయ్య, గుమ్ముల సంతోష్ లను కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లు తెలిపారు.
నిందితుల నుంచి ఎర్టిగా, రేనాల్డ్ డస్టర్ల్ కార్లు,రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కేసుని త్వరగా ఛేదించిన సీ ఐ అల్లం నరేందర్, ఎస్సై పీ.సతీష్, పోలీస్ సిబ్బంది మురళి, అంజిబాబు, తిరుపతి, సునీల్ లను ఏసిపి ప్రకాష్ అభినందించారు.