జనసముద్రం న్యూస్ గుడివాడ ప్రతినిధి. సెప్టెంబర్.15
గుడివాడ పట్టణ స్థానిక పవర్ బ్రిడ్జి కింద అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో అన్ని తామై అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్
ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ (Rk )మాట్లాడుతూ సమాజమే దేవాలయం గా భావిస్తూ మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో ఆకలితో ఉన్న అనార్థులకు ఆకలి తీర్చడమే కాకుండా అనాధ అంత్యక్రియలు కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, అదేవిధంగా ఈరోజు గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో స్థానికులు సమాచారం అందజేయగా పోలీస్ వారికి సమాచారం అందజేసి అంతక్రియలు చేయడం జరిగింది అని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో పోలీసు వారు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు
దయచేసి మానవత్వాన్ని బ్రతికించాలని గుడివాడ పట్నంలో అనాధలు గాని పిల్లలు లేకపోయినా వాళ్లే గాని ఎవరైనా ఉంటే అన్ని నేనే ఇలాంటి దాహం సంస్కారాలు చేస్తారని తెలియజేశారు, ఆ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో శివ, చరణ్, శ్యాం బాబాయ్ ఫ్రెండ్ సర్కిల్, ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు