జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 15, పల్నాడు జిల్లా, మాచర్ల.
మాచర్ల పట్టణంలోని నెహ్రునగర్ మెయిన్ రోడ్ నందు బొల్లినేని శ్రీను మరియు గడిపూడి రామకృష్ణ కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన “నవయుగ రెస్టారెంట్” ను మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు, టీడీపీ సీనియర్ నాయకులు యెనుముల కేశవరెడ్డి, నర్రా గురవారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పోలూరి నరసింహారావు, బండ్ల బ్రదర్స్, పంగులూరి అంజయ్య, బొల్లినేని శ్రీను, గడిపూడి రామకృష్ణ పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.