జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 14, పల్నాడు జిల్లా, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి.
ఈరోజు అనగా 14.09.2024 రెండో శనివారం కావటంతో 132/33 కె.వి మాచర్ల మరియు 132/33 కె వి గుండ్లపాడు సబ్ స్టేషన్ పరిధిలో గల మాచర్ల టౌన్, మాచర్ల మండలం, దుర్గి మండలం మరియు వెల్దుర్తి మండల పరిధిలో గల అన్ని గ్రామాలలో ఈరోజు (శనివారం) ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 2గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకు అనగా 33 కె వి ఫీడర్స్ పరిధిలో లైన్స్ మెయింటినెస్ , ట్రీ బ్రాంచెస్ కటింగ్, సబ్ స్టేషన్ మెయింటినెన్స్ మరియు రోడ్డు వైడైనింగ్ వర్క్స్ జరుగుతుంది.
కావున ఆ ప్రాంతాలలో గల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్థకు సహకరించవలసిందిగా
మాచర్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓఎస్డి ఎ.రామయ్య ఒక ప్రకటనలో కోరారు.