
జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెల్లి పరశురాములు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తన మహేంద్ర బొలెరో వెహికల్ లో తరలిస్తుండగా ఎస్సై అభిలాష్ పట్టుకొని తదుపరి చర్యల నిమిత్తం అట్టి బొలెరో వెహికల్ ని కోహెడ తాసిల్దారు కు అప్పగించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.