-తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.14,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా:-తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారంజిల్లా కేంద్రంలో రహదారి బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిత్యం వార్త సేకరణలో భాగంగా వర్కింగ్ జర్నలిస్ట్ లు ప్రమాదాలకు మరియు అనారోగ్యబారిన పడుతున్నారని,రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వర్కింగ్ జర్నలిస్టులకు కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించాలని మరియు అనారోగ్యంతో లేదా ప్రమాదాల ద్వారాలకు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్సగ్రెషియో ఇవ్వాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్,జి.శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు జి.సత్యనారాయణ,పి రమేష్ పాల్గొన్నారు