అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…

Spread the love

  • ఆ దొంగల వల్ల.. ఆ దొంగల కోసం.. మా కడుపు కొట్టద్దయ్య… పనులు జరగక పనులు లేక ఇబ్బంది పడుతున్నామయ్యా…
  • ఏపీఎండిసి సంస్థ పైన సిబిఐ ఎంక్వయిరీ ఏసి…?? త్వరగా పరిష్కరించండి అయ్యా..
  • నెల రోజులుగా నిలిచిన బైరటిసు సరఫరా… మూత పడిన మిల్లలు… అయోమయంలో కెమికల్ ప్లాంట్లు… కోట్లలో నష్టాలు.. రోడ్డున పడ్డ వేలమంది కార్మికులు..
  • రైల్వే కోడూర్ “ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్” … “టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి” … మా ఆకలి కేకలు, మీరైనా చెప్పండి అయ్యా సీఎం గారికి… గనుల శాఖ మంత్రి కి

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది మిల్లులు, అనేక కెమికల్ ఫ్యాక్టరీ లు గత కొద్దీ రోజులుగా ఖనిజ సరఫరా లేక మూతపడ్డాయి.. వీటి మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఇందులో పని చేసే వేల మంది కార్మికులు దాదాపు రోడ్డున పడ్డారని చెప్పవచ్చు. అంతే కాకుండా మిల్లులకు కెమికల్ ఫ్యాక్టరీలకు ఖనిజాన్ని సరఫరా చేయడానికి రవాణా కోసం వినియోగించే కొన్ని వందల లారీల యజమానులు ఫైనాన్స్ కింద తీసుకున్న నెలవారి EMI లు చెల్లించలేక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. లారీ డ్రైవర్ లు మెషిన్ హెల్పేర్ లు పనులు లేక జీతాలు అందక తీవ్ర పూటగడవడమే కష్టతరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్రతి సారి ఇలా మంగంపేట మైనింగ్ లో కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయని స్థానికంగా గనుల విస్తరణకోసం ఇల్లు భూములు కోల్పోయి జీవనాధార నిమిత్తం మైనింగ్ మీద ఆధారపడి నిర్మించుకున్న మిల్లుల యజమానులు, కెమికల్ ప్లాంట్ యజమానుల బాధ వర్ణనాతీతం.ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కానీ పరిస్థితి.గతంలో ఒక మాజీ ఎంపీ ఇచ్చిన తప్పుడు నివేదిక ఆధారంగా కూడా ఇలానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలు సరైన కారణం లేకుండానే ఖనిజ సరఫరా నిలిపివేయడం వల్ల దీని మీద ఆధారపడి నిర్మించుకున్న మిల్లు యజమానులు బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్ లు కట్టలేక కరెంటు బిల్లులు లక్షల్లో చెల్లించలేక దాదాపు 200 మిల్లులు మూతపడి బ్యాంకు వాళ్ళు స్వాధీనం చేసుకోవడమే కాకుండా షూరిటీ కింద పెట్టిన వారి ఆస్తులను కూడా వేలం వేయడం జరిగింది. అంతే కాకుండా మంగంపేట ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ ఏర్పడి డిమాండ్ తగ్గి వందల కోట్లు నష్టాలబాటలో ఏపీఎండీసీ మైనింగ్ కొన్ని సంవత్సరాలనుండి నడిచింది.అప్పట్లో దీని మీద ఆధారపడి నిర్మించుకున్న దాదాపు 200 మిల్లులు అన్ని మూతపడి వ్యాపారాలు దెబ్బ తినడమే కాకుండా వీటి మీద అనేక విమర్శలు వెళ్లువెత్తాయి… దీనిని సరిదిద్దడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అనేక తంటాలు పడాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. ఇపుడు కూడా ఇదే తరహాలో ఏ మాత్రం ఆలోచించకుండా ముగ్గురాయి సరఫరా నిలిపివేతపైన మిల్లు యజమానులు తమ బాధను వ్యక్తం చేస్తూ మిల్లులను నిర్మించుకొనుటకు పర్మిషన్లు ఇచ్చిన ఏపీఎండీసీ తమ మిల్లులను స్వాదీనం చేసుకుని వాటికీ నష్టపరిహారం కట్టిస్తే స్వచ్చదంగా గా మిల్లులను మూసివేసుకుంటామని వ్యాపారాల నుంచి తప్పుకుంటామని ఈ బాధలు పడలేమని కూడా వారిలో వారే మదనపడుతున్నారని తెలుస్తోంది. వ్యాపారాలను రాజకీయాలతో ముడిపెట్టి చూడటం ఎవరికీ మంచిది కాదు అని వీటి మీద అనేక మంది జీవితాలు ఆధారపడి ఉంటాయానే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.రాష్ట్రము లో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కూడా ఇలాంటి వింత అనుభవం ఎప్పుడు ఎదురుకాలేదు అని వైస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన కొత్త టెండర్లలో రేట్లు పెంచినా అంతర్జాతీయ మార్కెట్ లో మన ఖనిజానికి ఉన్న డిమాండ్ వల్ల ఎక్కడ నష్టాలు లేకుండా వ్యాపారాలు సజావుగానే కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఒక్క నెల నుంచి ఎలాంటి వ్యాపారాలు లేక వేల మంది రోజు వారీ కార్మికులు, ప్రొక్లైనర్ ఆపరేటర్లు, లారీ డ్రైవర్లు ఇబ్బందుల్లో పడటమే కాకుండా పూటగడవని పరిస్థితి.దీని మీద మిల్లు యజమానులు మరియు కెమికల్ ప్లాంట్ యజమానులు విజయవాడ లో ఉన్న గనుల శాఖ మంత్రిని కలిసి కూడా తమ సమస్యలను వివరించడం జరిగిందని ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు అని దీని మీద వెంటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ గారు మరియు టీడీపీ ఇంచార్జి ముక్క రూపానంద రెడ్డి గారు చొరవ తీసుకుని సమస్యలను ప్రభుత్వంతో చర్చించి త్వరగా మిల్లులకు కెమికల్ ప్లాంట్ లకు ముగ్గురాయి సరఫరా చేసేలా ప్రభుత్వానికి వివరించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

  • Related Posts

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    Spread the love

    Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో…

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    Spread the love

    Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు