యాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్ నివాసాల మధ్యన ఉండడంతో ప్రజలు ఒకసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే మంటలు భారీగా ఎగసిపడ్డాయి.ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందని తెలుస్తోంది.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…