జన్నారం మండల విలేకరి జనసముద్రం న్యూస్ జూలై 12:
సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరి బాలికల పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వేధింపులు ఎదురైతే పోలీసులకు గాని, షీటీంకు గాని తెలపాలని ఆయన సూచించారు. అలాగే సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులు ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…