పాఠశాల మరమత్తులు జరిపించండి…చిన్న
చౌడాపూర్ మండల ప్రతినిధి జులై 09/జనసముద్రం న్యూస్ :
ప్రభుత్వం పాఠశాలల భవనాలతో పాటు విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోంది. ప్రతీ యేటా విద్యా సంవత్సరం ఆరంభంలో ఆయా పాఠశాలల భవనాల మరమ్మతులకు,ఇతరత్రా పనుల నిమిత్తం నిధులను విడుదల చేస్తోంది.కానీ విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది.శిథిలావస్థలో ప్రాథమిక పాఠశాల బంగ్రంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో వర్షపు నీరు స్లాబ్,గోడల నుంచి రావడంతో భవన నిర్మాణం దెబ్బతింటోంది. అక్కడక్కడ సజ్జలు కూడా పెచ్చులూడుతూ దర్శనమిస్తున్నాయి. చలికాలం,ఎండాకాలం పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నా,వర్షాకాలంలో మాత్రం విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పడంలేదు.పాఠశాలకు ప్రహరీ లేదు పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేదు.వెనక భాగాన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో గత వర్షాకాలంలో పాఠశాల ఆవరణలో పాములు సంచరించాయని గ్రామస్తులు,ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.పాముల సంచారంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురవుతున్నారు.బడి… భయపెడుతుంది…పాఠశాలలో వర్షం వస్తే నిలిచిపోతున్న బోధన.. చౌడాపూర్ మండలం బంగ్రంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో దయనీయ పరిస్థితిదీ. వర్షాకాలం కావడంతో సర్కారు బడి భవనాలు శిథిలావస్థకు చేరి భయపెడుతున్నాయి. పాఠశాల భవనాలు ఎప్పుడు కులుతాయోనాన్న ఆందోళన నెలకొంది. బిక్కుబిక్కుమంటు ఉపాధ్యాయులు,విద్యార్థులు గడుపుతున్నారు.పట్టించునే నాధుడే లేరు.పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ విద్యాశాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా పాఠశాల మరమ్మతులకు నోచుకోకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామ యూవకులు చిన్న అధికారులను కోరుతున్నారు.





