ఈ రిస్క్ ఎందుకు విక్రమ్?

Spread the love

ఇండియాలో వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. అతను ఏ క్యారెక్టర్ చేసిన దానికి 100 శాతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు అతను చేసిన పాత్ర మాత్రమే కనిపిస్తుంది తప్ప విక్రమ్ ఎక్కడా కనిపించడు. అంతలా ప్రేక్షకులని తాను చేసిన పాత్రలకి కనెక్ట్ అయ్యేలా విక్రమ్ నటిస్తాడు. అందుకే బెస్ట్ యాక్టర్స్ లలో అతను ఒకడుగా ఉన్నాడు.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే జీరో సైజ్ లోకి మారిపోతాడు. కావాలంటే భారీకాయుడుగా బాడీ బిల్డ్ చేసి కనిపిస్తాడు. శరీరంపై కాస్ట్యూమ్స్ లేకుండా నటించాలన్నా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు అలాంటి మరో విలక్షణమైన పాత్రని తంగలాన్ మూవీలో చేశాడు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. చిత్రంలో తంగలాన్ అనే ఆదిమ ఆటవిక కమ్యూనిటీకి చెందిన నాయకుడిగా చియాన్ విక్రమ్ కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. గత ఏడాదిలోనే ఫస్ట్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. తరువాత సంక్రాంతికి అని చెప్పారు. ఆ తరువాత మరో రెండు సార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమాపై హైప్ తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో తాజాగా మూవీ రిలీజ్ ని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. జూన్ 20న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. అఫీషియల్ గా చిత్ర యూనిట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. జూన్ 27న కల్కి2898ఏడీ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి వారం ముందుగానే తంగలాన్ రానుంది. సినిమాకి పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ షేర్ వారంలోనే కలెక్ట్ చేసేయాలి.

కల్కి 2898ఏడీ రిలీజ్ అయితే బజ్ మొత్తం ఈ చిత్రానికి వచ్చేస్తుంది. వారం ముందు నుంచే ఆ సినిమా ట్రైలర్ హడావుడి కూడా ఉంటుంది కాబట్టి లైమ్ లైట్ లోకి రావడం కష్టం. ఇక ఓ వర్గం మిడిల్ క్లాస్ ఆడియెన్స్ కూడా వచ్చే వారం కల్కి ఉంది కదా అనే ఆలోచనకు రావచ్చు. దీంతో తంగలాన్ కోసం చిత్ర యూనిట్ అనుకుంటున్న రిలీజ్ డేట్ కాస్తా రిస్క్ తో కూడుకున్నదనే మాట వినిపిస్తోంది. అయితే తమిళ ఆడియన్స్ కల్కి కంటే తంగలాన్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తారని భావించి ఆ డేట్ కి పా రంజిత్ ఫిక్స్ అయ్యాడా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. ఏది ఏమైనా చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితేగాని తంగలాన్ భవిష్యత్తు ఏంటనేది తెలియదు. ఇక టాక్ హై రేంజ్ లో ఉంటే తప్ప నిలదొక్కుకోవడం కష్టం.

  • Related Posts

    టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

    Spread the love

    Spread the loveజగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న…

    భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను తరిమి కొట్టిన భారత సైన్యం

    Spread the love

    Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : ఇండో-చైనీస్ సరిహద్దుల్లో భారత సైన్యం   చైనా నేతృత్వంలోని పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)  మళ్లీ ఘర్షణకు దిగాయి. ఈ తాజా ఘర్షణ వివరాలు పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ వాస్తవ నియంత్రణ రేఖ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు