భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను తరిమి కొట్టిన భారత సైన్యం

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :

ఇండో-చైనీస్ సరిహద్దుల్లో భారత సైన్యం   చైనా నేతృత్వంలోని పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)  మళ్లీ ఘర్షణకు దిగాయి. ఈ తాజా ఘర్షణ వివరాలు పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వద్ద చైనా యథాతథ స్థితిని మార్చిందని ఆరోపిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో భారత్ చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనుమతి లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు సరిహద్దు రేఖను కూడా మార్చడానికి ప్రయత్నించినందుకు చైనా సైనికులను భారత సైన్యం తరిమికొట్టింది. వందల మంది చైనా సైనికులను కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న భారత సైన్యం దీటుగా ఎదుర్కొని కర్రలతో వారిని తరిమి తరిమికొట్టింది.

అక్రమంగా భారత గడ్డపైకి అడుగుపెట్టినందుకు చైనా సైనికులను చెక్క కర్రలు లోహపు కడ్డీలతో భారత సైనికులు కొట్టడం వీడియోలో మనకు కనిపిస్తుంది. భారత సైనికులు కనికరం లేకుండా చైనా సైన్యానికి ధీటుగా సమాధానం ఇచ్చారు.

అయితే ఇది తాజా వీడియోనా లేక పాతదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో భారత్ – చైనా సైన్యాల మధ్య ప్రస్తుత ఘర్షణ జరిగింది.. ఇది 1962 కాదని సరిహద్దుల వద్ద చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా దాడి చేయగల సామర్థ్యం భారత్కు ఉందని చైనాకు ఇప్పటికే భారత నేతలు హెచ్చరికను పంపారు.ప్రస్తుతం చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్ల వీడియోను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. భారత సైనికుల వీరధైర్యాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Related Posts

ఈ రిస్క్ ఎందుకు విక్రమ్?

Spread the love

Spread the loveఇండియాలో వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. అతను ఏ క్యారెక్టర్ చేసిన దానికి 100 శాతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు అతను చేసిన పాత్ర…

టెన్త్ అమ్మాయికి గంజాయి ఇచ్చి అత్యాచారం!

Spread the love

Spread the loveజగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిలే లక్ష్యంగా.. వారికి గంజాయి ఇచ్చి అలవాటు చేసి, అనంతరం వారిని బానిసలుగా చేసి, వారిని రేవ్ పార్టీలకు తీసుకెళ్తూ, వ్యభిచార కూపంలోకి లాగుతూ అనేక ఘోరాలకు పాల్పడుతున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు