జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :
ఇండో-చైనీస్ సరిహద్దుల్లో భారత సైన్యం చైనా నేతృత్వంలోని పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మళ్లీ ఘర్షణకు దిగాయి. ఈ తాజా ఘర్షణ వివరాలు పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వద్ద చైనా యథాతథ స్థితిని మార్చిందని ఆరోపిస్తూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో భారత్ చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనుమతి లేకుండా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు సరిహద్దు రేఖను కూడా మార్చడానికి ప్రయత్నించినందుకు చైనా సైనికులను భారత సైన్యం తరిమికొట్టింది. వందల మంది చైనా సైనికులను కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న భారత సైన్యం దీటుగా ఎదుర్కొని కర్రలతో వారిని తరిమి తరిమికొట్టింది.
అక్రమంగా భారత గడ్డపైకి అడుగుపెట్టినందుకు చైనా సైనికులను చెక్క కర్రలు లోహపు కడ్డీలతో భారత సైనికులు కొట్టడం వీడియోలో మనకు కనిపిస్తుంది. భారత సైనికులు కనికరం లేకుండా చైనా సైన్యానికి ధీటుగా సమాధానం ఇచ్చారు.
అయితే ఇది తాజా వీడియోనా లేక పాతదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో భారత్ – చైనా సైన్యాల మధ్య ప్రస్తుత ఘర్షణ జరిగింది.. ఇది 1962 కాదని సరిహద్దుల వద్ద చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా దాడి చేయగల సామర్థ్యం భారత్కు ఉందని చైనాకు ఇప్పటికే భారత నేతలు హెచ్చరికను పంపారు.ప్రస్తుతం చైనా సైనికులను తరిమికొట్టిన భారత జవాన్ల వీడియోను తెగ షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. భారత సైనికుల వీరధైర్యాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.